
దుబ్బాక నియోజకవర్గ యువతకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారీ సమస్యల పరిష్కారానికి మెదక్ ఎంపీ కృషి చేస్తూ మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ యువజన నాయకులు దమ్మాగోని ప్రశాంత్ గౌడ్ అన్నారు. ఆదివారం అక్బర్ పేట భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట గ్రామంలో విలేఖర్ల తో మాట్లాడారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గం లోని యువతకు, ప్రజా ప్రతినిధులకు అందుబాటులో ఉండి పార్టీ కార్యకలాపాల్లో మార్గ నిర్దేశం చేస్తున్నారని అన్నారు. యువతకు తాను అండగా ఉంటానన్న స్ఫూర్తి నింపుతూ పని చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో మెదక్ ఎంపీనీ దుబ్బాక ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో యువత గెలిపిచడం ఖాయమని అన్నారు