రామగౌడ్ ను పరామర్శించిన మెదక్ ఎంపీ 

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ :

అక్బర్ పేట-భూంపల్లి మండల సీనియర్ నాయకుడు పాపని రామగౌడ్ ఇటీవల అనారోగ్యానికి గురై దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకొని మెదక్ పార్లమెంటు సభ్యులు, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి వారిని కలిసి పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లిఎల్లా రెడ్డి, నాయకులు జీడి పల్లి రవి, కృష్ణ, కైలాసం, సురేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.