చిట్టాపూర్ ఎంపీటీసీ కి మెదక్ ఎంపీ పరామర్శ

నవతెలంగాణ- దుబ్బాక రూరల్: అక్బర్ పేట – భూంపల్లి  మండల పరిధిలోని చిట్టాపూర్ గ్రామ ఎంపిటిసి కనకయ్య తండ్రి బొల్లారం పోచయ్య మృతి చెందారు.  ఈ విషయం తెలుసుకున్న   మెదక్ పార్లమెంటు సభ్యులు, దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి సోమవారం వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. పోచయ్య మృతి బాధాకరమని అన్నారు. అనంతరం అధైర్య పడొద్దు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలోఎంపీ వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి పంతులు, రాష్ట్ర యువజన నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి, జెడ్పీటిసి కడతల రవీందర్ రెడ్డి, అక్బర్ పేట భూంపల్లి మండల అధ్యక్షుడు జిడిపల్లి రవి, సర్పంచులు రాజయ్య, నాయకులు కొత్త కిషన్ రెడ్డి,  చింతల కృష్ణ, కైలాసం, నారా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.