– దేశవ్యాప్తంగా 954 మందికి …కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ప్రకటన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివిధ పతకాల్లో తెలంగాణ నుంచి 34 మందికి పతకాలు వరించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని 29 మంది పోలీస్ అధికారులకు ఈ పతకాలు దక్కాయి. దేశవ్యాప్తంగా 954 మందికి సైనిక, పోలీసు అధికారులకు వివిధ పతకాలను కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 229 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ (పిఎంజి), 82 మంది పోలీసులకు రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు(పీపీఎం), 642 మందికి పోలీస్ విశిష్ట సేవా (పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) పతకాలను ప్రకటించింది.పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ) పతకాలు దక్కించుకున్న వారిలో అత్యధికంగా జమ్మూకశ్మీర్ నుంచి 55 మంది పోలీసులు ఉన్నారు. ఆ తరువాత మహారాష్ట్ర నుంచి 33, సీఆర్పీఎఫ్ నుంచి 27, ఛత్తీస్‌గఢ్ నుంచి 24 మందికి పీఎంజి పతకాలు దక్కాయి. ఈసారి అత్యున్నత రాష్ట్రపతి గ్యాలంట్రీ పోలీసు పతకం (పీపీఎంజీ) ఒకరిని వరించింది. సీఆర్పీఎఫ్ అధికారి లౌక్రకామ్ ఇబోంచా సింగ్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర హౌంశాఖ ఏటా రెండు సార్లు ఈ పోలీసు పతకాలను ప్రకటిస్తుంది.
ఈ అవార్డుల్లో తెలంగాణలో 22 మందికి పోలీస్ మెడల్స్ ఫర్ గ్యాలంట్రీ (పీఎంజీ), ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పోలీసు పతకం (పీపీఎం), 10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు ఇవ్వనున్నారు.
ఇద్దరికి రాష్ట్రపతి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు
తెలంగాణ నుంచి అదనపు డీజీ విజరు కుమార్, ఎస్పీ మాదాడి రమణ కుమార్‌కు రాష్ట్రపతి పోలీసు విశిష్ఠ సేవా పతకాలు వరించాయి
22 మందికి పోలీస్ గ్యాలంట్రీ మెడల్స్
ఎస్పీ భాస్కరన్, ఇన్‌స్పెక్టర్లు శివప్రసాద్, పురుషోత్తం రెడ్డి, ఆర్‌ఐ రమేష్, ఎస్సై బండారి కుమార్, ఆర్‌ఎస్‌ఐలు మహేశ్, షేక్ నాగుల్ మీరా, హెడ్ కానిస్టేబుళ్లు ఆదినారాయణ, అశోక్, కానిస్టేబుళ్లు సందీప్ కుమార్, కార్తీక్, మధు, సంపత్, దివంగత సుశీల్, సునీల్ కుమార్, సుకుమార్, కళ్యాణ్ కుమార్, శ్రీధర్, రవీంద్రబాబు, రాథోడ్ రమేష్, మహేందర్ రావు, శివకుమార్‌కు పోలీస్ గ్యాలంట్రీ అవార్డులు వరించాయి.
10 మందికి పోలీస్ విశిష్ఠ సేవా పతకాలు
ఖైరతాబాద్ అదనపు ఎస్పీ బండి వెంకటేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీలు మిశెట్టి రామకృష్ణ ప్రసాద్ రావు, ఆత్మకూరి వెంకటేశ్వరి, ఆర్‌ఎస్‌ఐలు ఆందోజు సత్యనారాయణ, కక్కెర్ల శ్రీనివాస్, మహంకాళి మధు, ఆర్‌ఐ అజెల్ల శ్రీనివాస రావు, సీనియర్ కమాండో రసమోని వెంకటయ్య, హైదరాబాద్ ఇన్స్ స్పెక్టర్ అరవేటి భాను ప్రసాద్ రావు, ఏఎస్‌ఐ సాయన వెంకటేశ్వర్లకు పోలీస్ సేవా పతకాలు దక్కాయి.
తెలంగాణకు చెందిన లీడింగ్ ఫైర్ మ్యాన్ శ్రీనివాస్‌కు విశిష్ట సేవలందించినందుకు గాను ఫైర్ సర్వీస్ మెడల్ దక్కింది. అలాగే హౌంగార్డులు చీర్ల కృష్ణ సాగర్, కె సుందేర్ లాల్‌కు హౌమ్ గార్డ్స్ అండ్ సిివిల్ డిఫెన్స్ మెడల్స్ వరించాయి.
జైళ్ల శాఖలో నలుగురికి అవార్డులు
జైళ్ల శాఖలో తెలంగాణకు చెందిన డిప్యూటీ సూపరింటెండెంట్ గౌరి రామచంద్రన్, డిప్యూటీ జైలర్ చెరుకూరి విజయ, అసిస్టింట్ డిప్యూటీ జైలర్ సీహెచ్ కైలాష్, హెడ్ వార్డర్ జీ మల్లా రెడ్డికి ప్రతిభ పురస్కారాలు దక్కాయి.