తైక్వాండోలో వీణవంక స్కూల్ విద్యార్థులకు మెడల్స్

నవతెలంగాణ-వీణవంక
తెలంగాణ టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా శ్రీరామ స్కేటింగ్ అకాడమీలో జూన్ 25న నిర్వహించిన స్టేట్ లెవెల్ జూనియర్స్ తైక్వాండో పోటీలలో 45కేజీ,43కేజీ విభాగాలలో మెడల్స్ సాధించిన వీణవంక ఉన్నత పాఠశాల విద్యార్థులు బబ్బురి అక్షిత( బ్రాంజ్ మెడల్), పొడపత్రపు చందన (సిల్వర్ మెడల్) లను హెచ్ఎం పులి అశోక్ రెడ్డి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ తైక్వాండో శిక్షణ కండర వ్యవస్థను బలోపేతం చేసి అంతర్గత బలాన్ని నిర్మిస్తుందన్నారు. స్థిరమైన మానసిక స్థితికి, రోగనిరోధక శక్తి సంతులనానికి, సహన శక్తి మరియు శక్తి స్థాయిలను పెంచి శరీరం యొక్క చురుకుదనాన్ని పెంచుతుందన్నారు. వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆపద సమయంలో తమను తాము రక్షించుకునేందుకై ఉపయోగపడుతుంది అన్నారు. విద్యార్థులను తీర్చిదిద్దిన మాస్టర్ బావు సంపత్ ను ప్రత్యేకంగా అభినందించారు.