నవతెలంగాణ – డిచ్ పల్లి
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జిల్లా నుండి పాలు బస్సులు వేయడంతో గ్రామీణ ప్రాంతాలకు వచ్చే బస్సుల సంఖ్య తక్కువగా కావడంతో వచ్చిన బస్సుల్లోనే ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది.మంగళవారం మధ్యాహ్నం సమయం లో బస్సులు సమయానికి రాక పోవడంతో కామారెడ్డి నుండి నిజామాబాద్ కు వేళ్ళే బస్సులో దాదాపు వందకు పైగానే ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ బస్సు దిగి కొద్ది సేపు కింద కూర్చున్నారు.ఇంకోక్క బస్సు వాస్తే ఈ బస్సులో నుండి కొందరు వెళ్తారని అనుకున్న సద్యపడ లేదు.గత్యతరం లేక ఫూట్ బోర్డు పై ఒంటి కాలుపై నిలబడి నిజామాబాద్ వరకు ప్రయాణించక తప్పులేదని ప్రయాణికులు వాపోయారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జిల్లా నుండి ఎక్స్ప్రెస్, ఆర్డినరీ బస్సులు వేయడంతో సమయానికి బస్సులు లేక గంటల తరబడి పొడి గపులు కాయకు తప్పడంలేదు.
రాత్రి సమయంలో బస్టాండ్ లోకి రాని ఎక్స్ ప్రెస్ బస్సులు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా రాకపోకలు సాగించు కోవచ్చని అదేశాలు ఇచ్చినప్పటి నుండి నేటి వరకు ఆర్మూర్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, బోధన్ డిపోలకు చెందిన కోన్ని ఎక్స్ ప్రెస్ బస్సులు రాత్రి అయిందంటే జాతీయ రహదారి 44 పై,లేక సర్విస్ రోడ్డు నుండి రాకపోకలు సాగిస్తున్నారు.ఎవరైన ఇందల్ వాయి మండల కేంద్రంలో దిగే వారు ఉంటేనే సర్విస్ రోడ్డు పై బస్సు నిలిపి దించేస్తున్నారు. అర్మూర్, నిర్మల్,మెంట్ పల్లి కు గంటల కో సారి బస్సులు వస్తుంటాయి.ఇవన్ని ఎక్స్ ప్రెస్ బస్సులే.. రాత్రి సమయంలో బస్టాండ్ లో ఈ రూట్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు గత్యంతరం లేక టోల్ ప్లాజా వద్ద కు వెళ్ళి స్వస్థలాలకు వేళ్ళక తప్పడం లేదు.ఇకనైన ఆర్టీసీ అధికారులు దూరం ప్రాంతాలకు వేళ్ళే బస్సులు, రాత్రి, మధ్యాహ్నం, ఉదయం తో సంబంధం లేకుండా బస్టాండ్ లోనికి వచ్చే విధంగా చూడాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.