మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి

మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలిరాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21 తేదీ నుంచి 24 తేదీ వరకు జరగనున్న మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందు కంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర. రెండేళ్లకోసారి వచ్చే మహా సంబురాన్ని చూడడానికి కోట్లా దిమంది భక్తులు హాజరవుతారు. కుంభమేళ తర్వాత ఎక్కు వ మంది హాజరయ్యే జాతర ఏదైనా ఉందంటే అది మేడార మేనని చెప్పుకోవాలి. నాలుగురోజుల పాటు నిర్వహించ నున్న జాతరలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే ఈ జాతరకు సుమా రు ఏడువందల ఏండ్ల చరిత్ర ఉంది. 1940 వరకు చిలకల గుట్ట మీద జరిగే జాతరకు గిరిజనులు మాత్రమే వచ్చే వాళ్లు. కాలక్రమేణా మన రాష్ట్రంతో పాటు దేశంలోని వివి ధ రాష్ట్రాల నుంచి ఈ జాతరకు గిరిజనులతో పాటు గిరిజ నేతరులు కూడా పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. ము ఖ్యంగా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల నుంచి లక్షల కొద్ది ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. ఈ జాతర ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1968లోనే రాష్ట్ర పండుగ గా గుర్తించింది.
అయితే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిం చాలని రాష్ట్ర ప్రభుత్వం 2008 నుంచే కోరుతున్నది. ప్రతి జాతర సమయంలో ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నా కేంద్రం మాత్రం ఎలాంటి నిర్ణయం ప్రకటిం చడం లేదు. తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కేంద్ర గిరి జన వ్యవహారాల శాఖకు పూర్తి వివరాలతో కూడిన నివేదిక అంద జేసింది. 2020 జాతర సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చిన అప్పటి కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి కూడా వినతులు సమర్పించింది. జాతరకు జాతీ య హోదా వస్తే కేంద్రం నుంచి నిధులు రావడమే కాకుం డా దేశవ్యాప్తంగా గుర్తింపుతో పాటు పర్యాటక ప్రదేశంగా కూడా అభివృద్ధి చెందే అవకాశముంది. కానీ కేంద్రం సం స్కృతి సంప్రదాయలకు గౌరవిస్తామంటూనే తెలం గాణలో అతి పెద్ద గిరిజన జాతరను మాత్రం పట్టించుకోవడం లేద నే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలహాబాద్‌లో జరిగే కుంభమేళా తర్వాత అత్యంత మహా జాతరగా సాగుతున్న ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయి.
జాతీయ హోదా వస్తే యునెస్కో గుర్తింపునకు అవ కాశం ఉంటుంది. కోల్‌కతా దుర్గాపూజ ఎలాగైతే యునెస్కో గుర్తింపు పొందిందో అలాగే చారిత్రక నేపథ్యం కలిగిన మే డారం జాతరకు కూడా యునెస్కో వారసత్వ హోదా పొందే అవకాశం ఉంటుంది. ఎలాంటి విగ్రహాలు గానీ కనీసం గుడి కూడా లేని పలు విశిష్టతలు కలిగిన ఈ జాతర ఇంటా న్జబుల్‌(కనిపించని) వారసత్వ సంపద కేటగిరీలో యునె స్కో వారసత్వ హోదా లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.
– పుల్లూరు వేణుగోపాల్‌, 9701047002