మేడారం జాతర పనుల్లో వేగం పెంచాలి

– రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క
– మేడారం జాతర కు 75 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
– భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం
– వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
– మేడారం జాతర పనులను పరిశీలించిన మంత్రి సీతక్క
నవతెలంగాణ -తాడ్వాయి 
మేడారం జాతర పనుల్లో వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ & స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు.  సోమవారం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకుని వనదేవతలకు ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ఎండోమెంట్ అధికారులు, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు ఘనంగా స్వాగతం పలికారు. మనదేవతలకు ఇష్టమైన పసుపు కుంకుమ చీరే సారా సమర్పించి ప్రత్యేక మొక్కులు చెల్లించారు. ముందుగా గోవిందరావు పేట మండలం లోని పసర వద్ద నున్న గుండ్ల వాగు బ్రిడ్జిని, దయ్యలవాగు సమీపం లో ఉన్న  రోడ్డును, చింతల్ క్రాస్ వద్ద రోడ్డును, పార్కింగ్ స్థలాలను, ఊరట్టం బ్రిడ్జి నీ వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అదే విధంగా చిలుకల గుట్ట మరియు విఐపి, వీవిఐపి పార్కింగ్ లను, బస్ స్టాండ్ ను పరిశీలించి అధికారులకు  దిశ నిర్దేశించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చెయ్యడం జరుగుతుందని,  అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతం చేసే విధంగా ఉండాలని అధికారులకు పలు ఆదేశాలు చేశారు. జాతరలో కంటే ఈసారి జాతరలో మెరుగైన సౌకర్యాలు అందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ గౌస్ ఆలం, ఐటిడిఎ పి. ఓ. అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పి. శ్రీజ, డిపిఓ వెంకయ్య, డిఎస్పీ రవీందర్, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, పిఎసిఎస్ చైర్మన్ పులి సంపత్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, సీనియర్ నాయకుడు అర్రెం లచ్పచు పటేల్, సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ముజాఫర్ హుస్సేన్, ముత్తినేని లక్ష్మయ్య, యూత్ అధ్యక్షులు కోడి సతీష్, శనిగరపు చిరంజీవి, పల్నాటి సత్యం, బాదం ప్రవీణ్, అహ్మద్ భాషా భానోత్ రవిచందర్, వివిధ శాఖల అధికారులు,  ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.