
నవతెలంగాణ -తాడ్వాయి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతరకు నిర్వహించే అభివృద్ధి పనులు నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మేడారంలో తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్ అధ్యక్షతన జిల్లా కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశమునకు తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతర ఆసియా ఖండంలోనే ఆదివాసీ గిరిజనుల అతిపెద్ద జాతర. ఈ జాతరకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసి ప్రజలు, శ్రీ సమ్మక్క సారలమ్మ భక్తులు కోట్లాదిమంది వివిధ రాష్ట్రాల నుండి పాల్గొంటారని వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ యొక్క జాతరకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలను వెచ్చించి మౌలిక పనులు ప్రారంభించిందని అన్నారు. ఈ పనులన్నీ కూడా భక్తులకి ఉపయోగపడే విధంగా చేపట్టాలని డిమాండ్ చేశారు. మేడారం జాతర పనులు అని కూడా నాణ్యతమైన పనులలో నాణ్యత లోపించినట్లయితే తుడుందెబ్బ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని గుర్తు చేశారు. మేడారం అభివృద్ధి పనులన్నీ కూడా నత్త నడకగా కొనసాగుతున్నాయని వీటిని త్వరగా పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాణ్యత లోపించిన అటువంటి పనుల కాంట్రాక్టర్ల లైసెన్సులను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జాతీయ కో- కన్వీనర్ పొడెం రత్నం, రాష్ట్ర కార్యదర్శి చింత కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎట్టి రాజబాబు, కాపుల సమ్మయ్య, పొలం తిరుపతి, సిద్ధబోయిన సర్వేశ్వరరావు, కోట సంపత్, వట్టం సురేష్, కుచ్చింటి చిరంజీవి, ప్రచార కార్యదర్శి చింత శ్రావణ్, సురేష్ వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.