మేడారం జాతరను పర్యావరణ రహితంగా నిర్వహించాలి

– “పర్యావరణ పరిరక్షణ” మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాసరావు
– ఊరట్టం విద్యార్థులతో ర్యాలీ
నవతెలంగాణ – తాడ్వాయి
ఆసియా ఖండంలో అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతరను పర్యావరణ రహితంగా నిర్వహించాలని పర్యావరణ పరిరక్షణ మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చౌలం శ్రీనివాస్ రావు అన్నారు. సోమవారం మండలంలోని మేడారం  సరిహద్దు గ్రామపంచాయతీ అయిన ఊరట్టం గ్రామపంచాయతీలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ఊరటం విద్యార్థినిలు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్లే కార్డ్స్ తో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మనం వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చౌలం శ్రీనివాస్ రావు, ఉరటం హెచ్ఎం ఈసం రమేష్ లు మాట్లాడుతూ మేడారం మహా జాతరకు కోటి లక్షల భక్తుల పైచిలుకు వస్తారని, ప్లాస్టిక్ ను వ్యర్థాలను పూర్తిగా నిషేధించాలన్నారు. వాతావరణ మార్పులు పర్యావరణ కాలుష్యం నేడు మానవాళికి ముప్పుగా పరిణమిస్తుంది అన్నారు. ప్లాస్టిక్ పదార్థాల్లో స్టైల్ బెంజిన్ లాంటి విషపూరిత రసాయనాలు ఉంటాయి కనుక ఇది క్యాన్సర్ ముప్పును పెంచుతాయన్నారు. వాతావరణ కాలుష్యం తో నాడీ వ్యాధులు, శ్వాస కోస, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయ రుగ్మతులకు దారితీస్తుందన్నారు. ప్రభుత్వం మేడారం జాతరలో వన్ టైం యూస్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మనం వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పెద్దల నరేష్, ఊరట్టం పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రాజయ్య, సమ్మయ్య, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.