నేడే మేడారం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

– హాజరుకానున్న దేవదాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు
నవతెలంగాణ – తాడ్వాయి
ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం మహా జాతర మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారం నేడు నిర్వహించినట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, కాబోయే మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ అర్రెం లచ్చు పటేల్ లు అన్నారు. ముఖ్య అతిథులుగా దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్కలు హాజరు కానట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, మేధావులు, ఆదివాసి సంఘాలు హాజరై ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాబోయే చైర్మన్ 14 మంది ట్రస్ట్ బోర్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.