మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2024- డైరీ ,క్యాలెండర్ ఆవిష్కరణ..

– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలలో వైద్య రంగ శాఖలోని గెజిటెడ్ అధికారులు కీలకంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2024 -డైరీ, క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్య ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. గెజిటెడ్ అధికారుల డైరీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని నాయకులను అభినందించారు. తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాలీమొద్దీన్ అహ్మద్ మాట్లాడుతూ..జిఒనెం 317, జీఒనెం142 లను సవరించాలని, ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని వైద్యశాఖ మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాసులు, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ రామాంజనేయులు, కోశాధికారి పి చంద్రశేఖర రావు, జి నరసింహారెడ్డి నామాల శ్రీనివాసులు మంజుల విజయనిర్మల రాజకుమార్, చిట్టి బాబు మురళీధర్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.