కస్తూర్బా గురుకుల హాస్టల్లో వైద్య శిబిరం..

నవ తెలంగాణ- రామారెడ్డి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ హాస్టల్లో మంగళవారం రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సురేష్ ఆధ్వర్యంలో విద్యార్థినిలకు వైద్య శిబిరం నిర్వహించారు. 71 మంది విద్యార్థినిలకు రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు సురేష్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైనందున పరిసర ప్రాంతంలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలని, దోమల కుట్టకుండా దోమతెరలు, కిటికీలకు జాలీలను వాడాలని, వేడి చేసి చల్లార్చిన నీటిని త్రాగాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది భీం, జానకమ్మ, దోమల శ్రీధర్, పవన్, లింబమ్మ, అన్నపూర్ణ, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.