మండలంలోని రెడ్డి పేటలో ఆర్కే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం చిన్న పిల్లలకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 130 మంది పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు అందజేశారు. ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పిల్లలు ఆరోగ్యంగా ఎదుగు తేనే, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించ గలుగుతాము అని అన్నారు కార్యక్రమంలో వైద్యులు కే రమేష్, సిబ్బంది శేఖర్, గ్రామస్తులు సూర్య గంగాధర్,కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.