
మండలంలోని కోల్హరి గ్రామంలో మంగళవారం డాక్టర్ భీం రావ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడి రోగులకు వైద్యం అందించారు. వర్షాలు కురుస్తున్నందున జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇళ్లలో పరిశుభ్రత పాటించండని తెలిపారు. ప్రదానంగా దోమలు, ఈగలు అభివృద్ధి చెందకుండా చూడాలని, వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు శుభ్రం ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఈ రోజు వైద్య శిబిరం లో సుమారు 50 మంది రోగులకు పరీక్షలు జరిపి తగిన మందులు, సూదులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎచ్ఈఓ సూర్య ప్రకాష్, పిఎచ్ఎన్ సుశీల, హెల్త్ అసిస్టెంట్ జి రాము, ఏ ఎన్ ఎంలు గంగుబాయి, ఆరాధన, ఆశా వర్కర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు.