జంట ఆశ్రమ పాఠశాలల్లో వైద్యం శిభిరం..

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని సున్నం బట్టిలో గల సున్నం బట్టి,పెద్దవాగు ప్రాజెక్టు బాలురు ఎ.హెచ్.ఎస్ జంట ఆశ్రమ పాఠశాలల్లో అశ్వారావుపేట(వినాయకపురం) ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రాందాస్ పర్యవేక్షణలో మంగళవారం వైద్యశిభిరం నిర్వహించారు. తరుణ వ్యాధులతో బాధపడుతున్న 58 మంది విద్యార్థులను పరీక్షించి చిరు వ్యాధులు గా నిర్ధారించి   చికిత్స అందించారు.జ్వరంతో బాధపడుతున్న ఒక్కరిని గుర్తించి రక్త పూత నమూనాలు సేకరించి పరీక్ష నిర్వహించి సాదారణ జ్వరం కు చికిత్స అందించారు. ఇందులో విద్యార్థులకు వ్యక్తి గత శుభ్రతకు సంభందించిన  రోగ్యవిద్యను అందించారు.విద్యార్ధులకు అందజేస్తున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. నాణ్యమైన కూరగాయలు తో రుచికరమైన వేడి పదార్ధాలను వడ్డించాలి అని సూచించారు.అనంతరం హాస్టల్ పరిసరాలు పరిశీలించి బ్లీచింగ్ చల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి అజ్మీరా వెంకటేశ్వర్లు, హెచ్.ఇ.ఒ రాజు, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్,  విజయ రెడ్డి, ప్రసాద్, ఎ.ఎన్.ఎం చెల్లమ్మలు పాల్గొన్నారు.