తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రొగ్రాం జిల్లా ఇంచార్జ్ మైదం రాజు సమాట్లాడుతూ.. ఈ శిబిరాన్ని ప్రజలందరూ ఉపయోగించుకున్నారని ఆయుర్వేద మందులు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని, అన్ని రకాల వ్యాధులకు మందులు అందజేస్తారని తెలిపారు. ప్రాచీన కాలం నాటి భారతీయ వైద్యంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించాలని దీర్ఘకాలిక వ్యాధులకు అన్ని రకాల వ్యాధులకు ఉచిత పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు. బిపి షుగర్ పరీక్షలు నిర్వహించామని తెలియజేశారు. ఈ శిబిరంలో మండల వైద్యాధికారిని డాక్టర్ యాసం వనజ, డాక్టర్లు ఉషా రవి, కె రవి, రాజు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.