వసతి గృహాలలో వైద్య శిబిరాలు    

Medical camps in hostelsనవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణంలోని అశ్వారావుపేట(వినాయక పురం) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ లోగల  గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల,ప్రజాసంఘాల కార్యాలయం సమీపంలోని మహాత్మ జ్యోతి రావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో వైద్యాధికారి రాందాస్ నాయక్ పర్యవేక్షణలో మంగళవారం వైద్య శిబిరాలు నిర్వహించారు.  రెండు వసతి గృహాలలో మలేరియా,డెంగ్యూ టెస్ట్స్ నిర్వహించారు.అందరికీ నెగెటివ్ ఫలితాలు వచ్చాయి.  వివిధ రకాల రుగ్మతలకు ఉచితంగా మందులు అందజేశారు.సాదారణ జ్వరం తో ఉన్న వారికి రాడికల్ చికిత్సలు చేసారు.ఎవరికీ మలేరియా లేదు అని ఫలితాలు వచ్చాయి. వర్షా కాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు అని,ఈ వర్షా కాలంలో కాచి చల్లార్చి న నీటిని తాగాలని, జ్వరం వస్తే వెంటనే ఆశా ను, హెల్త్ అసిస్టెంట్ ను, ఏఎన్ఎం ను  సంప్రదించి,తగు సలహా పొందాలని వైద్యుడు సూచించారు. ఈ వైద్య శిబిరం లో వైద్య సిబ్బంది  ప్రసాద్,ఎస్ వేంకటేశ్వర రావు, ఎచ్.వి దుర్గమ్మ, అరుణ, ఎం ఎల్ ఎ చ్ పి రేష్మ, ఆశా భారతి , ఆయా పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.