కలెక్టర్ మరియు డి ఎం అండ్ హెచ్ ఓ ల ఆదేశాల మేరకు మండలంలో ఆల్ గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ లో సోమవారం మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య వైద్య శిబిరాలను ప్రారంభించి చల్వాయి మరియు గోవిందరావుపేట గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. విద్యార్థులకు వచ్చే సీజనల్ వ్యాధుల గురించి మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ టైఫాయిడ్ దగ్గు జలుబు దోమల వల్ల జాగ్రత్తగా ఉండాలని హాస్టల్ చుట్టూ ప్రక్కల నీరు నిల్వ ఉండకుండా చూడాలని వార్డెన్ కు చెప్పడం జరిగింది. పిల్లలకు తడిగా ఉండే దుస్తులు వాడడం వల్ల ఎలర్జీ ఫామ్ అవుతుంది దగ్గు జలుబు ఒకరికి వచ్చినచో అది అందరికీ వ్యాపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ సునీత ఆయుష్ డాక్టర్ అనూష ఎం ఎల్ హెచ్ పి లక్ష్మి పి హెచ్ ఎన్ హెల్త్ అసిస్టెంట్ జంపయ్య శ్రీనివాస్ కృష్ణయ్య ఏఎన్ఎం కాలిక రాజక్క శకుంతల వార్డెన్స్ శ్రీలత సరిత మరియు ఆశలు పాల్గొన్నారు.