అశ్వారావుపేట (వినాయక పురం) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలైన రెడ్డిగూడెం,బండారి గుంపు ల్లో వైద్యాధికారి రాందాస్ నాయక్ పర్యవేక్షణలో గురువారం సిబ్బంది వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు గృహ సందర్శన చేపట్టారు.ప్రతీ ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని గుర్తించి తొలిగించే సారు. అనంతరం ఆయా గ్రామాలలో వైద్య శిబిరం నిర్వహించి పలురకాల కాలానుగుణంగా వ్యాప్తి చెందే రుగ్మతలకు ఉచితంగా మందులు అందజేశారు.జ్వరం తో ఉన్న వారికి మలేరియా నిర్ధారణ పరీక్షలు చేసారు.ఇందులో ఎవరికీ మలేరియా నిర్ధారణ కాలేదు.వర్షా కాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు అని,ఈ వర్షా కాలంలో కాచి చల్లార్చి న నీటిని తాగాలని, జ్వరం వస్తె వెంటనే ఆశా ను,హెల్త్ అసిస్టెంట్ ను, ఏఎన్ఎం ను సంప్రదించి తగు సలహా పొందాలని వైద్యుడు సూచించారు. ఈ వైద్య శిబిరం లో హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్,రవి, సత్యనారాయణ,సతీష్,ఏ ఎన్ ఎం బీబీ నాంచారి,ఆయా గ్రామాల ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.