మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామాన మెడికల్ క్యాంపు నిర్వహించాలని, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ అన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లు దేవేందర్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసిన కారణంగా మండలంలో ప్రజలు విష జ్వరాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ములుగు జిల్లా కలెక్టర్, డి ఎం అండ్ హెచ్ ఓ అల్లెం అప్పయ్య లు ప్రత్యేక శ్రద్ధతో మండలంలోని ముఖ్యంగా బంధాల లవ్వాల, కొండపర్తి, కాటాపూర్ గ్రామాల్లో డెంగ్యూ మలేరియా జ్వరాలతో బాధపడుతున్నారని తక్షణమే మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి తగిన మందులు అందించి మలేరియా డెంగ్యూ విష జ్వరాలు తగ్గేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేగాకుండా దోమల మందు పిచికారి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, సింగిల్ విండో డైరెక్టర్లు యానాలసిద్ది రెడ్డి, రంగనబోయిన జగదీష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు బుషబోయిన రవికుమార్, గ్రామ కమిటీ అధ్యక్షులు పాక రాజేందర్ నాయకులు నేతాజీ తదితరులు పాల్గొన్నారు.