
నవతెలంగాణ-గోవిందరావుపేట
ప్రజలు వర్షాకాలంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని బుస్సాపురం గ్రామంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందితో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. ఎంతో దూరం నుండి సిబ్బంది మందులు తీసుకొని వచ్చి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్న క్రమంలో గ్రామంలోని ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి వివరించి పరిష్కారం పొందాలని అన్నారు. ఎప్పుడైనా ఆరోగ్య సంబంధ సమస్యలు ఏర్పడినట్లయితే స్థానిక వైద్య సిబ్బంది నీ సంప్రదించాలని సూచించారు. ఈ ఆరోగ్య శిబిరంలో 73 మందిని పరీక్షించగా వీరులు ఇద్దరు జ్వర బాధితులు కాగా ఇతర చిన్న చిన్న సమస్యలు ఉన్నవారిని గుర్తించి పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ సురేష్ బాబు హెల్త్ అసిస్టెంట్ కృష్ణయ్య వెంకట నరసమ్మ ఆశ కార్యకర్తలు రజిత సరిత పంచాయతీ కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.