
నవతెలంగాణ – పెద్దవంగర
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వడ్డెకొత్తపల్లి పల్లె దావఖాన వైద్యాధికారి రాజ్ కుమార్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్ రవి అన్నారు. గురువారం గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలు చేపట్టి, ప్రజలకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జర్వం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి పరమేష్, ఏఎన్ఎం బూబ్, ఆశ కార్యకర్త రజిత తదితరులు పాల్గొన్నారు.