మండలంలోని రామారెడ్డి, అన్నారం పిహెచ్సి పరిధిలో అన్నారం , పోసానిపేట, ఇసన్న పల్లి, రామారెడ్డి అంగన్వాడి కేంద్రాల్లో పిల్లలకు వైద్య పరీక్షలు, వైద్యులు సురేష్, మానస ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కిషోర్ బాలలకు అంగన్వాడీ ద్వారా వచ్చే బాలామృతం, గుడ్డు తప్పకుండా వినియోగించుకోవాలని, ఎలాంటి సమస్యలు వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి, తీసుకోవలసిన జాగ్రత్తలపై తల్లులకు సూచనలు చేశారు. వైద్య సిబ్బంది పద్మ, జ్యోతి, శోభ, అంగన్వాడి సూపర్వైజర్ ఉమారాణి, అంగన్వాడి టీచర్లు, ఆయాలు, కిశోర బాలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు.