వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్తహీనత, చర్మ వ్యాధులు, కళ్ళు, దంతాలు పరీక్షలు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్రీయ బాల్ శ్వాస్థ్య ( ఆర్ బి ఎస్ కే) కార్యక్రమం చేపట్టారు.నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ బాల్ శ్వాస్థ్య ( ఆర్ బి ఎస్ కే)కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు 360 విద్యార్థిని, విద్యార్థులకు రక్తహీనత, చర్మవ్యాధులు, కళ్ళు, దంతాలు మొదలగువాటికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ లహరిక, పావని, వైద్య సిబ్బంది, కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు తో పాటు తదితరులు పాల్గొన్నారు.