నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేములవాడ పట్టణంలోని అర్బన్ కస్తూర్బ పాఠశాలలో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం విద్యార్థిణిలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేశారు. ఈ వైద్య శిబిరం లో 174 మంది విద్యార్థులనులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు స్వప్న, హన్మాజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డా మధు ప్రవచిని, డా స్వప్న, డా సాయి వైష్ణవి, ఆరోగ్య పర్యవేక్షకులు గంగమరాజు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తో పాటు తదితరులు పాల్గొన్నారు.