రోగులకు వైద్య పరీక్షలు

Medical examinations of patientsనవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని మామిడిపల్లి గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు  గత 5 రోజులుగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి 150 మందిని పరీక్షించి, 41 మందికి రక్త పరీక్షలు చేశారు. ఆశా కార్యకర్తలు, గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామ పంచాయితి సిబ్బంది అందరూ కలిసి ఇంటింటికి  వెళ్లి పరిసరాల పరిశుభ్రత, వారానికి ఒక రోజు డ్రైడే పాటించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో వైద్య అధికారి డాక్టర్ ప్రకాష్ కుమార్, ఆరోగ్య విస్తరణ అధికారి ప్రవీణ్ రెడ్డి, సరిత,భాగ్యలక్ష్మి,సుజాత, శ్రీలేఖ, పద్మావతి, శ్రీలత పాల్గొన్నారు.