వైద్యారోగ్య శాఖ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ మీడియా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర దైనిందిని (డైరీ), క్యాలెండర్‌ లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్‌ రాజనర్సింహ మాట్లాడుతూ వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో, వ్యాధుల, చికిత్సల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా ఆఫీసర్ల పాత్ర ఎంతో ముఖ్యమైనదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు కొప్పు ప్రసాద్‌, కిరణ్‌ రెడ్డి, కోశాధికారి తిరుపతిరెడ్డి, సహ అధ్యక్షులు జక్కుల రాములు, ఉపాధ్యక్షులు రామాంజనేయులు, కటకం శంకర్‌, శ్రీనివాస్‌, రేష్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.