నవతెలంగాణ- హైదరాబాద్
తమ ఉద్యోగులు, వినియోగదారుల కోసం ‘శ్రేయ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్’ పేరుతో ప్రత్యేక ఆరోగ్య బీమా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని శ్రేయ మ్యూజిక్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేటివ్ హెడ్ హేమంత్ కుమార్ రారు తెలిపారు. ఈ పథకం కింద శ్రేయ గ్రూప్ ఉద్యోగులు రూ.3 లక్షల వరకు ఆరోగ్య కవరేజీని అందుకుంటారన్నారు. ఈ సంస్థలోని లీడర్స్ రూ.10 లక్షల వరకు కవరేజీకి అర్హులన్నారు. శ్రేయ గ్రూప్ వినియోగదారులు రూ.రెండు నుంచి మూడు లక్షల మధ్య ఆరోగ్య బీమా కవరేజీ ప్రయోజనం పొందుతారన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 20వేల పైగా ఆస్పత్రులలో చికిత్సను అందించే భాగస్వామ్య బీమా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నా మన్నారు. ఇటీవల తాము రెండు భక్తి గీతాలను కూడా విడుదల చేశామన్నారు.