ఫోన్‌ పేలో నెల వాయిదాల్లో వైద్య బీమా

న్యూఢిల్లీ : ప్రముఖ చెల్లింపుల వేదిక ఫోన్‌ పే కొత్తగా బీమా సంస్థల భాగస్వామ్యంతో ఫోన్‌పే ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ సర్వీసెస్‌ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇందులో నెలవారి చెల్లింపుల పద్దతిలోనూ వైద్య బీమా పొందడానికి వీలు కల్పించినట్లు ఆ సంస్థ పేర్కొంది. బీమా వినియోగాన్ని మరింత సులభతరం చేయడానికి ఇది దోహదం చేయనుందని పేర్కొంది. రూ.1 కోటి వరకు విలువ చేసే ప్లాన్లు అందుబాటులో ఉంచామని తెలిపింది.