నెలవారి చెల్లింపులతోనూ వైద్య బీమా

– స్టార్‌ హెల్త్‌తో ఫోన్‌పే జట్టు
న్యూఢిల్లీ : నెలవారి చెల్లింపు ఆప్షన్లతోనూ వైద్య బీమాను పొందవచ్చని ఫోన్‌పే తెలిపింది. ఇందుకోసం తాము స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్యూరెన్స్‌ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. యుపిఐ ఆటోపే ద్వారా తమ వినియోగదారులకు నెలవారీ, వార్షిక చెల్లింపు పద్దతిలో రూ.1 కోటి వరకు బీమా అందించడానికి ఈ ఒప్పందం చేసుకున్నామని ఫోన్‌పే ఇన్సూరెన్స్‌ సిఇఒ విశాల్‌ గుప్తా తెలిపారు.