వేతన సవరణ కమిటీ ఛైర్మన్ ను కలిసి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం వేతన సవరణ కమిటీ చైర్మన్ ఎన్ శివశంకర్ ఐఏఎస్ (రి) ను ల్యాబ్ టెక్నీషియన్స్ క్యాడర్ తరపున వేతన పెంపుదల కోరుతూ ఆయనకు వినతి పత్రం అందించారు. గత వేతన సవరణల లో ల్యాబ్ టెక్నీషియన్స్ క్యాడర్ కి జరిగిన అన్యాయాలని పూర్తిస్థాయిలో విచారించి ఈసారి న్యాయం జరిగేలా చూడాలని ఆయనను కోరినట్లు తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్లకు వృత్తిపరంగా ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల కలిగే జీవిత కాల ఆరోగ్య ప్రమాదాలకై అలవెన్సులను మంజూరీ చేయుటకై , వైద్యవిద్యా అలవెన్సులు ,ప్రత్యేక అలవెన్సు మంజూరు,  విద్యార్హతలు, వృత్తి నైపుణ్యత ఆయనకు వివరించారు.సమస్యలపై చైర్మన్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కార్యక్రమంలో అధ్యక్షులు హరినాథ్, ప్రధాన కార్యదర్శి రవీందర్, కోశాధికారి రాజేందర్, ఉపాధ్యక్షులు మహ్మద్ సలీం, కార్యదర్శి రమేష్, బురాన్, వేణుగోపాల్, భాస్కర్, సునీత, ప్రకాష్ నాయుడు పాల్గొన్నారు.