ఉన్నత విద్యా కమిషన్‌ పరిధిలోకి మెడికల్‌, లా కాలేజీలు రావు

– కేంద్ర విద్యా శాఖ మంత్రి వెల్లడి
న్యూఢిల్లీ : ఉన్నత విద్యా నియంత్రణా సంస్థను ఏర్పాటు చేసేందుకు త్వరలో పార్లమెంట్‌లో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఇసిఐ) బిల్లును ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ తెలిపారు. అయితే, మెడికల్‌, లా కాలేజీలు మాత్రం ఈ పరిధిలోకి రావని చెప్పారు. హెచ్‌ఇసిఐకి మూడు ప్రధాన పాత్రలు వుంటాయని, అవి నియంత్రణ, అక్రిడిటేషన్‌, వృత్తిపరమైన ప్రమాణాలు నిర్దేశించడమని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. నిధులు అందచేయడమనేది నాల్గవ పాత్రగా చూసినా, అది హెచ్‌ఇసిఐ పరిధిలో వుండదని చెప్పారు. నిధులకు సంబంధించిన స్వయంప్రతిపత్తి అనేది విద్యా మంత్రిత్వ శాఖ పాలనా పరిధిలో వుంటుందన్నారు.