రక్తపరీక్ష ఆ కేంద్రాలు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల వైద్యులు రక్తపరీక్ష ఆ కేంద్రాలను నియంత్రించాలని,రిపోర్ట్ లను తరచి చూసి వైద్యం చేయాలని వైద్యాధికారి డాక్టర్ రాందాస్ నాయక్ అన్నారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణం లోని నాగేశ్వర రావు ఆసుపత్రి నీ, రెండు రక్త పరీక్షా కేంద్రాల ను మంగళవారం తనిఖీ చేశారు.అర్హులైన సిబ్బంది ఉండాలని,అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ రిజిష్టర్ లను నిర్వహించాలని,రెన్యువల్ గడువు తీరిపోయి నందున,వాటిని రెన్యువల్ చేయించుకోవాలని సూచించారు.అలాగే ల్యాబ్స్ తప్పుడు రిపోర్ట్స్ ఇవ్వవద్దని,వారి ఇచ్చే రిజల్ట్ మీదనే వైద్యులు మందులు రాస్తారు కాబట్టి ఒకటి, రెండు సార్లు క్షుణ్ణంగా చూసి రిపోర్ట్ ఇవ్వాలని ల్యాబ్ వారికి సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమము లో ఆరోగ్య విస్తరణ అధికారి ఎస్.వేంకటేశ్వర రావు, హెల్త్ అసిస్టెంట్ ప్రసాద్ లు పాల్గొన్నారు.