
ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన బాడిశ నర్సింగరావు(35)గత ఐదు రోజులుగా తీవ్ర తలనొప్పి జ్వరంతో బాధపడుతూ ఉండి గ్రామంలో టాబ్లెట్లు వేసుకొని వాటికి కూడా ఫలితం లేకపోవడంతో గత రెండు రోజుల క్రితం ప్రభుత్వ ములుగు ఏరియా హాస్పిటల్ వెళ్లి అడ్మిట్ అయ్యాడు. ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యం చేస్తుండడంతో అక్కడినుండి ప్రైవేటుకు హాస్పిటల్కు పోదామని ఏటూర్ నాగారం తీసుకొచ్చారు. అక్కడ విషమించిందని వైద్యులు, ఎంజీఎం కు రిఫర్ చేశారు. అక్కడ పరిస్థితి తీవ్రంగా ఉందని వైద్యులు తెలిపారు. బ్రతుకుతాడని ఆశతో వరంగల్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆశ్రయించారు. అప్పటికే మృతి చెందాడని ప్రైవేటు వైద్యులు తెలపడంతో, బోరున వినిపించుకుంటూ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. అతనికి (మృతునికి)భార్య జ్యోతి, జోస్, ప్రణయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామాల్లో ఈ సీజన్లో దోమలు విపరీతంగా విజృంభిస్తున్న, ఈ సీజన్లో చేయవలసిన దోమల మందు పిచికారి చేయకపోవడంతో దోమలు బాగా వ్యాప్తి చెంది మలేరియా, డెంగు లాంటి సీజనల్ వ్యాధులు తో ప్రజలు తీవ్రంగా అనారోగ్యం పాలవుతున్నారని, వివిధ గ్రామాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత వైద్యాధికారులు ఏజెన్సీలోని ప్రతి ఇంటిలో దోమల మందు పిచికారి చేసి పారిశుధ్యం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టితో, వైద్య క్యాంపులు నిర్వహించాలని ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు. గ్రామాల్లో నిర్లక్ష్యం చేస్తున్న వైద్యాధికారులపై ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేసి అశ్రద్ధ వహిస్తున్న అధికారులపై, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల ప్రజలు అంటున్నారు.