– శాఖాపరమైన చర్యలు తప్పవు.
– భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యాధికారితోపాటు, వైద్య సిబ్బంది గాలికొదిలేశారు. వరసగా కురుస్తున్న భారీ వర్షాలతో పల్లెల్లో వరద ఉధృతి, సీజనల్ వ్యాధులు, పారిశుధ్యంపై పరిశీలించడానికి వచ్చిన భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆరోగ్య కేంద్రాన్ని సైతం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 24 గంటలు వైద్యం అందించాలనే ఆదేశాలు ఉన్నప్పటి ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి తోపాటు, సిబ్బంది ఎవరు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసి మండిపడ్డారు. విధులకు డుమ్మా కొట్టిన విద్యాధికారి, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, వైద్య సిబ్బంది పల్లెల్లో వైద్యం అందించాల్సి ఉండగా విధులకు హాజరు కాకపోవడంపై జిల్లా వైద్యాధికారి ఫోన్ చేశారు. డుమ్మా కొట్టిన వారిపై పూర్తీ నివేదిక అందజేయాలని ఆదేశించారు. అనంతరం మల్లారం గ్రామపరిదిలో ఉన్న కస్తూర్బా ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని సందర్షించారు. వసతి గృహంలో అపరిశుభ్రతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో గదులు,ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని లేదంటే చర్యలు తప్పవని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రవికుమార్, ఎంపిడిఓ శ్యామ్ సుందర్,ఇంఛార్జి ఆర్ఐ నరేశ్,ఎంపిఓ విక్రమ్,ఇరిగేషన్ ఏఈ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.