– రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు,
గనులు శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడి
నవతెలంగాణ-చేవెళ్ల
వైద్య వత్తి ఎంతో పవిత్రమైన వత్తి అని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, కళాశాల వైస్ చైర్మన్ వర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం చేవెళ్ల మండల కేంద్రంలోని డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాలలో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితులుగా రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొని సంతోష్ రెడ్డి, వరద రెడ్డిలతో కలిసి జ్యోతి ప్రజలన చేసి, వైద్య విద్యలో, నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సామాజిక వ్యవస్థలో వైద్యులు, ఉపాధ్యాయులకు ఎంతో గౌవరం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గంతలో ఎన్నడూ లేని విధంగా వైద్య, విద్య అభివద్ధికి రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ఎంతో కషి చేస్తున్నారని అన్నారు. వైద్య విద్య అభ్యసన కోసం కర్ణాటక, మహరాష్ట్ర ప్రాంతాలకు వెళ్లడం నాటి పరిస్థితులయితే నేడు ప్రతి జిల్లాలల్లో తెలంగాణ ప్రభుత్వమే ఒక మెడికల్ కాలేజ్ ను అందించిన ఘనత నేడు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రతీ జిల్లాకు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేసి త్వరలో ప్రతి ఏటా 10,000 మంది వైద్య విద్యార్థులలను తీర్చిదిద్ది, సిద్ధం చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కనుందని చెప్పారు. సంక్లిష్టమైన, వైవిద్యమైన వైద్య వత్తిలో నైపుణ్యాన్ని సాధించి దేశ విదేశాలకు తెలంగాణ విద్యార్థులు ఆదర్శం కావాలన్నారు. తల్లిదండ్రులు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని అందుకు వారి కలలను విద్యార్థులు సాకారం చేయాలని సూచించారు. విద్యాభ్యాసం పూర్తియిన తర్వాత ఉద్యోగాల కోసం విదేశాలకు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే బదులు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలను పొందుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, ఆపదలో ఉన్న ఆనారోగ్య బాధితులకు వైద్యం అందించాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో కళాశాల సెక్రెటరీ సంతోష్ రెడ్డి, డీన్ జోయారాణి, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.