
– అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ – కంటేశ్వర్
30 ఏళ్లుగా నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తూ, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మనుండి మెరుగైన వైద్య సేవలతో పాటు ఉచితంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. డాక్టర్టి.నరేంద్ర సేవలు అమోఘమని అన్నారు. శనివారం నగరంలోని ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్ద బాంబే నర్సింగ్ హోమ్ ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ,నగర మేయర్ దండు నీతూ కిరణ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అత్యాధునిక పరికరాలు ఏర్పాటుచేసి ఆధునికరించడం తో మరెన్నో సేవలు ఇకనుంచి అందుబాటులోకి రానున్నాయని అన్నారు. ఇప్పటినుంచి ఆసుపత్రిలో డెంటల్ సేవలు అందుబాటులో కి రానున్నట్లు తెలపడం అభినందనీయమన్నారు.ఆస్పత్రి యాజమాన్యం డాక్టర్ టి.నరేంద్ర, డాక్టర్ శాంతన్ రావు మాట్లాడుతూ..నగర ప్రజలకు డెంటల్ సౌకర్యం అందుబాటులో అందుబాటులోకి వచ్చిందని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ కామిని, డాక్టర్ రేణుక తదితరులు పాల్గొన్నారు.