నవతెలంగాణ – గోవిందరావుపేట
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను ఆప్యాయతతో పలకరిస్తూ వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఐ.యాల్. ఆర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ గదులను పర్యవేక్షించి ల్యాబ్ లో చేస్తున్న పరీక్షల గురించి ఆరాధిశారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు ఆప్యాయతతో వైద్య సేవలు మరియు వైద్య పరీక్షలు అందించాలని అక్కడి సిబ్బందికి తెలిపారు. అటు తర్వాత పస్ర ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రాజెక్టు నగర్ ఆయుష్మాన్ ఆరోగ్యం సందర్శించి ,మందుల నిల్వలను అడిగి తెలుసుకున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్యం ఓపి, మరియు హాజరు రిజిస్టర్ను పరిశీలించినారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్, చంద్రకాంత్, డీఈవో కిరణ్ ల్యాబ్ టెక్నీషియన్ నికిత మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.