వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి..

Medical staff should be punctual.– తాడిచెర్ల ప్రాథమిక  వైద్యాధికారి వినయ్

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక వైద్యాధికారి వినయ్ భాస్కర్ వైద్య సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపకేంద్రాల్లో కానీ రోగులను ఆరోగ్య కేంద్రానికి పంపాలని వైద్య సిబ్బందికి సూచించారు. సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవాలందించాలన్నారు.లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మందులు, రోజువారీ రిజిస్టర్ తనిఖీ చేశారు.