
మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని డిడిఓ,ఆరోగ్య కేంద్రం ఇంఛార్జి వైద్యాధికారి సందీప్ ఆదేశించారు. సోమవారం ఆరోగ్య కేంద్రం ఆవరణలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆరోగ్య కేంద్రంతోపాటు గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని. హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రాజు, హెల్త్ సూపర్ వైజర్స్, హెల్త్ అసిస్టెంట్స్,ఏఎన్ఎంలు,సిబ్బంది పాల్గొన్నారు.