ఔషధ, సుగంధ మొక్కలను విరివిగా పెంచాలి

– కిసాన్‌ మేళాలో మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఔషధ, సుగంధ మొక్కలను విరివిగా పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. శనివారం హైదరాబాద్‌లో ఆయా మొక్కల పెంపకంపై కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ మరియు ఇండిస్టియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడిసినల్‌ మరియు అరోమటిక్‌ ప్లాంట్స్‌ (సీఐఎంఏపీ) సంయుక్తంగా నిర్వహించిన కిసాన్‌ మేళాలో మంత్రి మాట్లాడారు.