
ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్ర ప్రజలు ముందుగా ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలి. అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ లో అండ్ హెల్త్ విషయంలో రూ.11468 కోట్లు ప్రవేశపెట్టడం బడ్జెట్ నిరాశ కలిగించింది. దీనికి తోడు కొన్ని ప్రత్యేక రాయితీలు కల్పించి ఉంటే బాగుండు. ముఖ్యంగా ప్రజలకు సీజనల్ వ్యాధులకు ప్రత్యేకంగా సదుపాయాలు అనగా ఉచిత వైద్య పరీక్షలు అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా మారుమూల గ్రామాలలో సైతం అధికారులను అందుబాటులో ఉంచేందుకు అధికారులకు ప్రత్యేక పారితోషకాలు గాని ఎక్విప్మెంట్లో ఇవ్వాలి. ఏది ఏమైనా డెంటల్, కిళ్ళు, చెవి, ముక్కు, మెంటల్ హెల్త్ పరీక్షలు సరైన ప్రదేశాలలో ఉచితంగా అందుబాటులో ఉంచడం హర్షనీయమన్నారు.