వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మందుల సామేలు

నవతెలంగాణ-అర్వపల్లి
తెలంగాణ ఉద్యమంలో  కీలక పాత్ర పోషించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేటీఆర్‌ ఆదేశానుసారం నడుస్తూ వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తి పార్టీ నియోజకవర్గ అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తనకే వస్తుందని మందులు సామేలు అన్నారు.మండలంలోని కోడూరు గ్రామంలో బీఆర్‌ఎస్‌ నాయకులు తనతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.రానున్న ఎన్నికల్లో తనకే టికెట్‌ వస్తుందని నియోజకవర్గంలో సొంత బిడ్డగా తనకు గెలిపించి తీరుతారని తాను పూర్తి మెజార్టీతో గెలుస్తున్న గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.14 ఏండ్ల నుండి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించా నన్నారు.తుంగతుర్తి నియోజకవర్గ మొదటిసారి అభ్యర్థిగా బరిలో నిలువగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం టికెట్‌ వదులుకున్నానని రెండవసారి కేటీఆర్‌ ఆదేశానుసారం బరిలో నుండి తప్పుకున్నానని అన్నారు. ఈసారి టిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా టికెట్తనకు వస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. గతంలో బరిలో నిలిచిన అభ్యర్థులు కంటే పూర్తి మెజార్టీతో గెలిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమంలో పని చేసిన తనకు ప్రజల తన గెలిపించి తీరుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.పార్టీ నాయకులు ప్రస్తుతం ఉన్న నాయకులతో సర్వే నిర్వహించి టికెట్‌ అందజేసిన తనకు ఓకేనన్నారు.తప్పకుండా తుంగతుర్తి అభ్యర్థిగా స్థానిక నాయకునిగా తనకే టికెట్‌ వస్తుందని ప్రజలందరూ తన వైపే ఉన్నారన్నారు.ఈ కార్యక్రమంలో చంచల శ్రీనివాస్‌, బోర్ర వెంకన్న, కృష్ణమూర్తి, సోమయ్య, అవులయ్య, శ్రీనివాస్‌, రాములు, వెంకన్న, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.