
నవతెలంగాణ – డిచ్ పల్లి
హైపర్ టెన్షన్ డయాబెటిస్ రోగికి నెలకు సరిపడా మందులు ఉచితంగా అందజేయాలని ,ప్రపంచ ఆరోగ్య సంస్థ పర్యవేక్షకులు డాక్టర్ అబ్దుల్ ఫషి అన్నారు.గురువారం ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసి అసంక్రమిత వ్యాధులైన హైపర్ టెన్షన్, డయాబెటిస్ క్యాన్సర్ వంటి వ్యాధులకు ప్రభుత్వం తరఫున ఇస్తున్న చికిత్స గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి పరిధిలోగల 16 ఆరోగ్య ఉప కేంద్రాల ఆరోగ్య కార్యకర్తలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క హైపర్ టెన్షన్ డయాబెటిస్ రోగికి నెలకు సరిపడా మందులు ఉచితంగా అందజేయాలని అందరికీ ప్రభుత్వం ద్వారా వచ్చే మందులు మాత్రమే వాడేలా చూడాలని ప్రైవేట్ ఆస్పత్రుల మందులు ఎవరైనా వాడినట్లయితే వారిని ప్రభుత్వ మందులు వాడే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు.
హైపర్ టెన్షన్ రోగులకు ఏ సమయంలో మందులు ఏ విధంగా వాడాలో ప్రోటోకాల్ ప్రకారం వాడేలా చూడాలని సూచించారు. డయాబెటిక్ ప్రోటోకాల్ కూడా పాటించాలని, నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్వాసి ముఖద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లయితే వారిని గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. వారిని తదుపరి చికిత్స కొరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆపై పెద్ద ఆసుపత్రికి పంపించేలా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతి నెల 30ఏళ్ళ పైబడిన వారందరికీ బీపీ పరీక్షలు, గ్లూకోజ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఆన్లైన్లో నమోదు కార్యక్రమం తొందరగా పూర్తి చేయాలని, ఆరోగ్య కార్యకర్తలకు ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్ వాయి పరిధిలోని గన్నారం ఆరోగ్య ఉపకేంద్రం ను పరిశీలించి ఉప కేంద్రంలో అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. ప్రతి ఉప కేంద్రంలో అసంక్రమిత వ్యాధుల రిజిస్ట్రార్ తప్పక ఉండాలని, మందుల స్టాక్ రిజిస్ట్రార్ ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని తెలిపారు . ఉపకేంద్రాలలో జరుగుతున్న అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల ప్రాజెక్టు అధికారి డాక్టర్ వినీత్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణ అధికారి, వైద్యాధికారి డాక్టర్ సంతోష్ , అసంక్రమితి వ్యాధుల ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఊహ శ్రీ ,జిల్లా అసంక్రమిత వ్యాధుల కోఆర్డినేటర్ వెంకటేష్, సురేష్, మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై.శంకర్ ,ఆనంద్ వెంకటరెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.