
– మెడికో విద్యార్థులకు క్రీడా పోటీలు, వ్యాసరచన, సంగీత గీతాలు,
– మేము సైతం దశాబ్ది ఉత్సవంలో
-మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరా
నవతెలంగాణ కంటేశ్వర్
తెలంగాణ దశాబ్ద ఉత్సవంలో మేము సైతం అంటూ నిజామాబాద్ మెడికల్ కళాశాల మేడుకో విద్యార్థులు, వైద్యులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు తెలంగాణ దశాబ్ది ఉత్సవంలో పాల్గొన్నారని నిజామాబాద్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా అన్నారు. మంగళవారం తెలంగాణ దశాబ్ది విద్యా ఉత్సవంలో భాగంగా ఎంతో ఘనంగా మెడికల్ కళాశాలలో నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా విద్య దశాబ్ది ఉత్సాహాన్ని జరుపుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ఆమె అన్నారు. విద్య అనేది వైద్యుడైన, వ్యాపారవేత్త అయిన, రాజకీయ నాయకుడైన ఎవరికైనా చాలా అవసరమని ఇలాంటి విద్యా ఉత్సవాలను జరుపుకోవడం మనమందరం అదృష్టంగా భావిస్తున్నామని ఆమె అన్నారు. నిజామాబాద్ మెడికల్ కళాశాల లోని మెడికో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా వ్యాసరచన పోటీలు, క్రీడా పోటీలు, తోపాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇంత చక్కటి అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తో పాటు, వైద్య విధాన పరిషత్ డైరెక్టర్, కమిషనర్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆమె అన్నారు. అనంతరం ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ దశాబ్ది ఉత్సవంలో పాల్గొన్న మెడికల్ విద్యార్థులకు విజేతలు
గా నిలిచినందుకు బహుమతులు అందజేయడం జరిగిందని ఆమె అన్నారు.. ఈ దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ రెడ్డి, ఆర్ఎంవోలు డాక్టర్ బాలరాజ్, డాక్టర్ నాగమోహన రావు, డాక్టర్ సుధాకర్ బాబు, ఏడి సుదర్శన్ కుమార్, సూపర్డెంట్ నాగరాజు డాక్టర్ గోపాల్ సింగ్ డాక్టర్ జల్గం తిరుపతిరావు, డాక్టర్ దినేష్ చక్రధర్ తో పాటు మెడికల్ కళాశాల వైద్యులు, అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
