మేడిగడ్డ బ్యారేజ్ కేసీఆర్‌ కు ఏటీఎం కార్డు 1,50,000 కోట్లతో నిర్మించారు.. అవినీతికి పాల్పడ్డారు..

– మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహన్,
– 6 గ్యారంటీలను నమ్మండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అభ్యర్థి లక్ష్మీకాంతరావు
నవతెలంగాణ- మద్నూర్: మేడిగడ్డ బ్యారేజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏటీఎం గా మార్చుకున్నారని ఈ బ్యారేజ్ నిర్మాణానికి 1,50,000 కోట్లు రూపాయలు ఖర్చు చేయడం ఆ బ్యారేజ్ నిర్మాణంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ బీటలు పడుతూ కూలిపోయే ప్రమాదానికి చేరిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చౌహన్ తెలిపారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జుక్కల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు గెలుపు కోసం ఆయన ఆదివారము నాడు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ ప్రసంగించారు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని దానిని ఏటీఎం గా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఇక్కడి ప్రజలను కోరారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలు గుర్తించి తన గెలుపు కోసం చేతి గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేద ప్రజల పార్టీ అని ప్రజల కోసమే పని చేస్తుందని తాను ఇక్కడ ప్రజాసేవ కోసం వచ్చానని పెద్దలు యువకులు సంబంధించిన పనులు ప్రత్యేకంగా చేపట్టి అందరి మన్ననాలు పొందే విధంగా పనిచేస్తానని ఎన్నికల ప్రచారంలో తోట లక్ష్మి కాంతారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో మహారాష్ట్రలోని దేగ్లూర్ ఎమ్మెల్యే జితేష్, కర్ణాటకలోని గుల్బర్గా సౌత్ ఎమ్మెల్యే ప్రభు పాటిల్ వీరితో పాటు దేగ్లూర్ మున్సిపల్ చైర్మన్ మొగులాజి మాజీ చైర్మన్ కంతి వార్ శంకర్ మేనూర్ గ్రామ సర్పంచ్ విట్టల్ గురూజీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్నూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.