చలో చార్మినార్ కు బయలుదేరిన ధ్యాన ప్రచారకులు

నవతెలంగాణ-ఆర్మూర్ : హైదరాబాద్ నగర నడిబొడ్డున చలో చార్మినార్ కార్యక్రమం పేరిట మహా కరుణ మెగా షాఖాహార ర్యాలీని ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహా కరుణ మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనడానికి మంగళవారం పట్టణ నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో దాదాపు 200 మంది ధ్యానులు బస్సులలో, మరియు కార్లలో తరలి వెళ్లారు. ప్రతి ఒక్క వ్యక్తి శాఖాహారం భుజించాలని, శాకాహారమే మానవ ఆహారమని ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని ప్రపంచానికి తెలియపరచడం కొరకు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రీజీ గారి ఆశయ సాధనలో భాగంగా ఈ శాఖ హార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి తరలి వెళ్తున్న వాహనాలను నవనాథ సిద్దేశ్వర పిరమిడ్ ధ్యాన మహా శక్తి క్షేత్రం అధ్యక్షులు తిరుమల గంగారాం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నల్ల గంగారెడ్డి , జండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నవనాథపురం కమిటీ సభ్యులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి  ,పెంబర్తి నారాయణ, సంతోష్ కుమార్, ప్రేమ్ సాగర్, అమరవాజి శ్రీనివాస్, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బొడ్డు దయానంధ్ ,సాయిబాబా ,నిశాంతు తదితరులు పాల్గొన్నారు.