నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ నేత్ర సంరక్షణ సంస్థ అయిన మెడివిజన్ ఐ కేర్ సెంటర్, లేజర్ విజన్ కరెక్షన్‌లో అత్యాధునిక ఆవిష్కరణ అయిన సిల్క్TM (స్మూత్ ఇన్‌సిషన్ లెంటిక్యూల్ కెరాటోమైల్యూసిస్) టెక్నాలజీని ఈరోజు హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ ఇన్‌స్టాలేషన్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని రోగులకు అధునాతన నేత్ర సంరక్షణను విస్తరిస్తుంది. మయోపియా మరియు ఆస్టిగ్మాటిజం సమస్యలతో బాధపడుతున్న రోగులకు జాన్సన్ & జాన్సన్ నుండి అధునాతన ELITA లేజర్ సిస్టమ్‌ను ఉపయోగించి దృష్టి సంరక్షణ ప్రమాణాలను పెంచడం మెడివిజన్ ఐ కేర్ సెంటర్ లక్ష్యంగా పెట్టుకుంది.
మెడివిజన్ ఐ కేర్ సెంటర్‌లో సిల్క్ TM టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావటం అనేది రిఫ్రాక్టీవ్ ఐ కేర్ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. మీడియా తో మాట్లాడిన , డాక్టర్ రూపక్ కుమార్ రెడ్డి కె , MBBS, MS – ఆప్తల్మాలజీ, మరియు మెడివిజన్ ఐ & హెల్త్ కేర్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మాట్లాడుతూ వ్యాధి భారం, మారుతున్న వినియోగదారుల ప్రవర్తన మరియు భారతదేశంలో వినూత్నమైన SILKTM సాంకేతికత యొక్క ప్రయోజనాల గురించి చర్చించారు. సిల్క్ TM యొక్క ముఖ్య ప్రయోజనాల్లో ఒకటి దాని ఫ్లాప్‌లెస్, పెయిన్‌లెస్ మరియు బ్లేడ్‌లెస్ విధానం. సాంప్రదాయ లేసిక్ విధానాలతో పోలిస్తే వేగంగా నయం కావటం , పొడి కళ్ళ లక్షణాలు తగ్గటం మరియు బలమైన కార్నియాలతో సహా రోగులకు అనేక ప్రయోజనాలను ఇది అనువదిస్తుందన్నారు.
డాక్టర్ రూపక్ కుమార్ రెడ్డి కె మాట్లాడుతూ, “అద్దాలు లేదా కాంటాక్ట్ లెన్స్‌లు లేకుండా జీవించాలనుకునే వారికి హైదరాబాద్‌లో సిల్క్TM టెక్నాలజీ పరిచయం ఒక విప్లవాత్మక పురోగతి సూచిస్తుంది. ఈ తదుపరి తరం లేజర్ విధానం సాటిలేని ఖచ్చితత్వం మరియు భద్రతను అందిస్తుంది, ప్రభావవంతమైన దృశ్య ఫలితాలను నిర్ధారిస్తుంది. కమ్యూనిటీకి స్పష్టమైన, సహజమైన దృష్టిని అందించటంలో సహాయ పడాలనే మా మిషన్‌లో గణనీయమైన ముందడుగు వేస్తూ మా రోగులకు సిల్క్TM ని అందించడానికి సంతోషిస్తున్నాము” అని అన్నారు.