నవతెలంగాణ రాజంపేట్ : మీసేవ సెంటర్ ఆపరేటర్లు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే రుసుము తీసుకోవాలని తహశీల్దార్ అనిల్ కుమార్ పేర్కొన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం మీసేవ సెంటర్ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎవరికైనా కులం సర్టిఫికేట్ ఇతర సర్టిఫికేట్ లు , కళ్యాణ లక్ష్మి / షాదీ ముబారక్ పైన తగు సూచనలు జారీ చేసినారు. ప్రజల దగ్గర గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రుసుములు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎమ్మార్వో సంతోషి, మీసేవ ఆపరేటర్లు సునీల్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.